Home » , , , , » ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’పై బన్నీ వివరణ

‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’పై బన్నీ వివరణ


అల్లు అర్జున్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడ్డాడనీ, పోలీసుల నుంచి తప్పించుకున్నాడనీ, రాజకీయ ఒత్తిళ్ళతో బన్నీని పోలీసులు వదిలేశారనీ.. రకరకాల కథనాలు మీడియాలో దర్శకనమిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్‌ స్పందించాడు. 

తాను చట్టాన్ని గౌరవిస్తాననీ, పోలీసులు తన కారుని ఆపి, బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేయడం నిజమేననీ, తాను ఎలాంటి కేసుల్లోనూ బుక్‌ అవలేదని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చాడు. పోలీసులతో తాను వాగ్యుద్ధానికి దిగానన్న మాటల్లో వాస్తవం లేదన్నాడు అల్లు అర్జున్‌. తనకు టెస్ట్‌ జరిగినా, క్లీన్‌ చిట్‌ లభించిందని బన్నీ వివరణ ఇచ్చాడు. 

తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తుండడం తనకు బాధ కలిగించిందని చెప్పిన బన్నీ, ‘ఐ యామ్‌ దట్‌ ఛేంజ్‌’ అనే షార్ట్‌ ఫిలం బాధ్యతతో చేశానన్నాడు. బాధ్యతగల పౌరుడిగానే నడచుకుంటానడానికి అదే నిదర్శనమని చెబుతున్నాడు అల్లు అర్జున్‌ అలియాస్‌ బన్నీ.

0 comments:

Post a Comment

Popular Posts

r