విలనిజం పండిస్తానంటోన్న మాఫియా లేడీ


మాఫియాతో సంబంధాల కారణంగా ‘మాఫియా లేడీ’గా వార్తల్లోకెక్కింది బాలీవుడ్‌ భామ మోనికా బేడీ. తెలుగులో శ్రీకాంత్‌తో ‘తాజ్‌మహల్‌’ సినిమాలోనూ, మోహన్‌బాబుతో ‘సోగ్గాడి పెళ్ళాం’ సినిమాలోనూ, లారెన్స్‌తో ‘స్పీడ్‌ డాన్సర్‌’ సినిమాలోనూ మోనికాబేడీ హీరోయిన్‌గా నటించిన విషయం విదితమే. అండర్‌ వరల్డ్‌ మాఫియాతో సంబంధాలు, ఆపై పాస్‌ పోర్ట్‌ కుంభకోణం.. వెరసి ఆమె కొన్నాళ్ళు జైల్లో వుండాల్సి వచ్చింది.

జైలు జీవితం అనంతరం తిరిగి వెండితెర ప్రయత్నాలు చేసిన మోనికాబేడీకి బాలీవుడ్‌ ‘రెడ్‌ కార్పెట్‌’ ఏమీ పరచలేదు. ఆమెతో సినిమాలు చేస్తే ఏమవుతుందోనన్న భయంతో బాలీవుడ్‌ దర్శక నిర్మాతలే కాదు, టాలీవుడ్‌లోనూ ఎవరూ ఆమెను ఎంకరేజ్‌ చేయలేదన్నది నిర్వివాదాంశం. తనకు ఇక సినిమా అవకాశాలు రావనే విషయం అర్థమయినా, ఇంకా ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే వుంది మోనికా బేడీ.

నెగెటివ్‌ రోల్స్‌లో నటించాలని వుందనీ, అలాంటి ఆఫర్స్‌ ఎవరైనా ఇస్తే రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించననీ, తెరపై తాను విలనిజం పండిస్తే దాన్ని చూసుకోవాలనే కోరికతో వున్నాననీ మోనికా బేడీ చెప్పుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, సొంతంగా సినిమా నిర్మించుకోవచ్చుగా.. అని మోనికాబేడీకి పలువురు బాలీవుడ్‌ సినీ జనం ఉచిత సలహా ఇస్తున్నారట. మోనిక కూడా తెరవెనుక సినీ నిర్మాణం పనులు ప్రారంభిస్తోందట. అలాగైతే మోనికాబేడీ విలనిజంను మనం తెరపై చూడొచ్చన్నమాట. 

0 comments:

Post a Comment

Popular Posts

r