ఉదయ్‌కిరణ్ ఎలా చనిపోయాడంటే...
Posted by Unknown
Posted on 7:05 PM
with No comments
సినీ నటుడు ఉదయ్‌కిరణ్ బలవన్మరణానికి పాల్పడ్డ విషయం విదితమే. సినీ పరిశ్రమను కలచివేసిందీ ఘటన. అతని అభిమానులు ఇప్పటికీ తమ అభిమాన హీరో మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి భవిష్యత్ వున్న నటుడు బలవన్మరణానికి పాల్పడటమేంటి.? అన్న ప్రశ్నకు ఇప్పటిదాకా సరైన సమాధానమే దొరకడంలేదు.
కాగా, ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డానికి ముందు, మద్యం సేవించాడని ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో తేలింది. అనంతరం ఉరి వేసుకుని ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ, ఊపిరి అందక అతను మృతి చెందాడని ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు. భార్యను ఓ ఫంక్షన్‌కి పంపించి, తర్వాత తానొస్తానని చెప్పిన ఉదయ్‌కిరణ్, ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఎలా చనిపోయాడు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరికిందిగానీ, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది.? అన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానా.? లేదంటే సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కకనా.? లేదంటే కుటుంబ సమస్యలా.? ఉదయ్‌కిరణ్ బలవన్మరణానికి కారణాలేమిటి.? ఉదయ్‌కిరణ్‌కి తప్ప ఇంకెవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా.!
0 comments:
Post a Comment