మెగా మేనల్లుడిని ఈ చౌదరి ఏం చేస్తాడో.?
Posted by Unknown
Posted on 1:22 AM
with No comments
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన ‘రేయ్’ సినిమా విడుదలకు నోచుకునే అవకాశాలైతే ఇప్పట్లో కన్పించడంలేదు. వైవీఎస్ చౌదరి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టాడు. ఆదినుంచీ ఈ సినిమాకి ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఆడియో వచ్చి ఏడు నెలలకు పైనే అయ్యింది. టీజర్ల మీద టీజర్లు వదిలారు. కానీ సినిమా విడుదలకు నోచుకోవడంలేదు.
ఈలోగా ఇంకో సినిమా విడుదలకు సిద్ధమైపోయింది.. సాయిధరమ్‌తేజ్ హీరోగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసేశారు. ఒకప్పుడు వైవీఎస్ చౌదరి సంచలన దర్శకుడు. ‘యజ్ఞం’ సినిమాతో ఏఎస్ రవికుమార్ చౌదరి కూడా సంచలన దర్శకుడే అన్పించుకున్నాడు.
వైవీఎస్ చౌదరీ వరుస ఫ్లాపుల్లో వున్నాడు.. ఏఎస్ రవికుమార్ చౌదరి పరిస్థితీ అంతే. వైవీఎస్ చౌదరి సినిమా అటకెక్కింది.. ఏఎస్ రవికుమార్ చౌదరి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతకీ, ఈ చౌదరి (ఏఎస్ రవికుమార్ చౌదరి) సినిమాతో అయినా సియాధరమ్‌తేజ్ ప్రేక్షకుల ముందుకొచ్చి మెగా వారసుడిననిపించుకుంటాడా.? ఏమోగానీ.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఫర్వాలేదన్పించుకున్నా, ‘రేయ్’ చకచకా థియేటర్ల ముందుకొచ్చేయడం ఖాయమే.
అంటే, రెండో సినిమా ఫలితమ్మీద తొలి సినిమా భవితవ్యం ఆధారపడి వుందన్నమాట.
Tags: Rey, Sai Dharma Tej, YVS Chowdary
0 comments:
Post a Comment