అచ్బంగా బాబు నాటి వైఎస్ లా ..!
Posted by Unknown
Posted on 1:20 AM
with 1 comment
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ఒకేసారి అధికారంలోకి వచ్చారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మోడీ అండతో బాబు అధికారంలోకి వచ్చారు. కానీ మోడీ స్టయిల్ రాజకీయం లేదా పాలన మాత్రం బాబు చేయడం లేదు. అధికారం అందింది ఆదిగా ఆయన తనది కాని ఓ కొత్త స్టయిల్ ను అలవర్చుకుంటున్నారు..అలవాటు చేసుకున్నారు.
ఇప్పుడు బాబు అచ్చంగా వైఎస్ రాజశేఖర రెడ్డి స్టయిల్ ను తన స్టయిల్ గా మార్చుకుంటున్నారు. నమ్మినా నమ్మకున్నా పరిశీలనగా చూస్తే అందరూ అంగీకరించే నిజం.
ఎన్నికలకు ముందే వైఎస్ మాదిరిగా పాదయాత్ర సాగించారు. ప్రజలకు ఫ్రీ కరెంట్ మాదిరిగా రుణమాఫీ హామీ ఇచ్చారు. అప్పుడు బాబు నో అన్నారు..ఇప్పుడు జగన్ నో అన్నాడు.
గతంలో బాబుకు అంతగా కులాభిమానం కనిపించదు. కానీ ఈ సారి ఎన్నికల్లో గెలిచినది ఆదిగా ఆయన అచ్చంగా అదే పోకడలతో వెళ్తున్నారు. ఇందులో వైఎస్ స్టయిల్ కనిపిస్తుంది. అదే మాదిరిగా రాజకీయ, అధికార కీలకపదవులు తమ కులం వారికి కట్టబెట్టడంలో వైఎస్ అడుగుజాడల్లో ఇప్పుడు బాబు నడుస్తున్నారు.
కాపు కులస్థుల అండతో పదేళ్లు పాలనను వైఎస్ సాగించారు. ఇప్పుడు అదే విధంగా బాబు ప్రారంభించారు తనపాలన. తమ కులస్థులకు మూడు పదవులు ఇస్తే, ఒకటి కాపులకు ఇవ్వడం ప్రారంభించారు.
ఇక నిర్ణయాలు మొండిగా తీసుకుని ముందుకు పోవడంలో కూడా వైఎస్ స్టయిలే. ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? తన నిర్ణయం తనది అనే విధంగా వెళ్తున్నారు. తాత్కాలిక రాజధాని ఇంకా కృష్ణా, గుంటూరు జిల్లాల విషయంలో.
డబ్బులు ఎంత వున్నా లక్షల కోట్ల బడ్జెట్ కూడ వైఎస్ మాదిరే. అప్పుడు బాబు ఇలాంటి బడ్జెట్ ను ఛ..ఛ అనేవారు. ఇప్పడు అదే మార్గం అనుకుంటున్నారు.
అసెంబ్లీలో వైఎస్ ప్రతిపక్షాన్ని తేలిగ్గా తోసి పుచ్చేవారు. చాలు చాల్లేవయ్యా..బాబూ..ఊరుకో..అని ఈసడింపుగా, తేలిగ్గా తీసేసేవారు. ఇప్పుడు బాబు ది కూడా అదే స్టయిల్. జగన్ ను ఇట్టే తీసేస్తున్నారు.
మొదటి సారి అధికారంలోకి రాగానే, అడ్డం వచ్చినవారిని తప్పించుకోవడం ద్వారా, రెండోసారి అధికారంలోకి వచ్చాక మిగిలిన శతృవులను తన పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా చిరకాలం పాలించాలనుకున్నారు వైఎస్. ఇప్పుడు ఈ రెండూ ఒకేసారి చేస్తున్నారు చంద్రబాబు.
మొత్తానికి చచ్చి ఏలోకాన వున్నారో కానీ, వైఎస్ ఒకప్పుడు చంద్రబాబుకు మంచి స్నేహితుడు..ఆ తరువాత బద్ధ శతృవు..ఇప్పుడు గురువుగా మారిపోయారు.
Tags: Chandrababu naidu, YSR
Anesukondi ra antha,meru mere anesukondi,Rey e state Ki ysr kanna mundu 9yrs cm babu Ra howle,Anthe gaani ysr kadu,Sharmila kuda padaayatra chesindi babu Ni inspire ayi chesinda vey,e kathalanni kattapettu jagan ni matram cm la uhinchukovadu,endukante ayana manavathithudu,devudu cm avadamenti Ra,devudu Ki cm post enti bha
ReplyDelete