Home » » పవన్ కు పెరుగుతున్న మద్దతు!

పవన్ కు పెరుగుతున్న మద్దతు!


రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ కు సినిమారంగం లోని వాళ్ళ దగ్గరనుండి అనూహ్యంగా మద్దతు పెరుగుతంది. ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడిన తీరు అందరికీ నచ్చింది,ముఖ్యంగా యువత లో మంచి జోష్ పెంచగా సినిమారంగంలోని వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. దర్శకులు రామ్ గోపాల్ వర్మ ,వి వి వినాయక్ ,మంచు లక్ష్మి ,నటులు అలీ సురేష్ లతో పాటు ఇంకా చాలా మంది బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజల్లో ఉన్న బాధ ని పవన్ అవిష్కరించాడని అందరూ భావిస్తున్నారు. మరోవైపు జనసేన వెబ్ సైట్ ని లాంచ్ చేసి సభ్యత్వాలను కూడా ఇస్తున్నారు. ఇజం పేరుతో రాసిన పుస్తకాన్ని ఈ నెల 25న ఆవిష్కరించనున్నారు. పవన్ ఈ రోజు నరేంద్ర మోడీ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 

0 comments:

Post a Comment

Popular Posts

r